Acharya Motion Poster: 'సిద్ద' లుక్స్ అదుర్స్

Acharya Motion Poster: రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'ఆచార్య' సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న 'సిద్ద' లుక్‌ని రిలీజ్ చేశారు

Kranthi
Updated on: 27 March 2021 11:12 AM IST
Megastar Chiranjeevi Acharya Movie Motion Poster Released
X

Acharya Movie Motion పోస్టర్:(ట్విట్టర్ ఇమేజ్) 

Acharya Motion Poster: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'ఆచార్య' సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న 'సిద్ద' లుక్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. చరణ్ బర్త్ డే పోస్టర్‌గా రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ లుక్‌లో 'సిద్ద' 'ఆచార్య'తో కలిసి ఉండగా మెగా అభిమానుల్లో..సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేదిగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రొడక్షన్స్-మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. చిరు ప్రధాన పాత్రలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్‌‌ నిర్మిస్తూ 'సిద్ధ'అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. తాజాగా చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను పోస్టర్‌ రూపంలో విడుదల చేశారు. వారిద్దరు చేతిలో తుపాకులతో వస్తున్న విరోచిత చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల చిరు చెప్పినట్టు వారి వేషధారణలు మావోయిస్టు తరహాలో ఉన్నాయి.

ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ అయిపోయింది. మోషన్ పోస్టర్‌లో కూడా ఎక్కువగా గుడినే హైలైట్ చేసారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇందులో కూడా ఓ ఊరి కోసం.. గుడి కోసం పోరాడే నాయకుడిగా నటిస్తున్నాడు చిరంజీవి. అతడి చేతిలో కత్తి.. పారుతున్న నెత్తురు చూస్తుంటే కమర్షియల్ అంశాలకు ఏ మాత్రం ఢోకా లేదని అర్థమైపోతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ తాజా పోస్టర్‌ని టీట్ చేస్తూ తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్కి బర్త్ డే విషెస్ తెలిపారు.

Kranthi

Kranthi

Next Story