Magastar Chiranjeevi Birthday Special : చిరంజీవి బర్త్‌డే స్పెషల్... మెగా ర్యాప్!

Magastar Chiranjeevi Birthday Special : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి ఇంకా 20 రోజుల సమయం ఉంది.. ఆగస్టు 22వ తేదీన ఆయన 65వ పుట్టినరోజు

Krishna
Published on: 2 Aug 2020 2:24 PM IST
Magastar Chiranjeevi Birthday Special : చిరంజీవి బర్త్‌డే స్పెషల్... మెగా ర్యాప్!
X
megastar birthday special mega rap song

Magastar Chiranjeevi Birthday Special : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి ఇంకా 20 రోజుల సమయం ఉంది.. ఆగస్టు 22వ తేదీన ఆయన 65వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. కానీ అప్పడే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజుకు గాను చరణ్ ఫ్యాన్స్ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం..

చిరంజీవి పుట్టినరోజుకి ముందుగానే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్'స్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఇక పాటను ఆగస్టు 21 న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర (స్కార్పియన్) ర్యాప్ ఆలపించారు.

ఇక అటు చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story