Chiranjeevi: ఆ.. ఇద్దరికీ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..

Mega Star Chiranjeevi Offer to Krishna Vamsi, Puri Jagannadh
x

Chiranjeevi: ఆ.. ఇద్దరికీ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..

Highlights

Chiranjeevi: ప్రభాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేతిలోనే ఇప్పుడు బోలెడన్ని బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

Chiranjeevi: ప్రభాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేతిలోనే ఇప్పుడు బోలెడన్ని బడా ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక సినిమాని చేసిన తర్వాత మరొక సినిమాని మాత్రమే లైన్ లో ఉంచుతున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం మూడు నాలుగు సినిమాలను పైప్ లైన్ లో పెట్టేస్తున్నారు. మరోవైపు చిరంజీవికి ఇప్పటికీ పలు డైరెక్టర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అందులో నచ్చిన సినిమాలను చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

తాజాగా తన "గాడ్ ఫాదర్" సినిమా ప్రమోషన్స్ లో కూడా పూరి జగన్నాథ్ తో ఒక ఇంటర్వ్యూ చేశారు. గతంలో మెగాస్టార్ తో పాటు ఆటో జానీ అనే సినిమా కథను రాసుకున్నానని పూరి చెప్పగా తాను రాసుకున్న ఆటో జానీ స్క్రిప్ట్ ని మళ్లీ ఒకసారి తనకి వినిపించమని అడిగారు చిరంజీవి. అయితే మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కి కూడా ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారు చిరు. "మీలాంటి డైరెక్టర్లు మంచి కథ దొరికితే తప్ప నన్ను అప్రోచ్ అవ్వరు. కానీ మీరైనా ఒక ముందు అడుగు వేస్తే తర్వాత కథలు అవే పూర్తవుతాయి. మీ డైరెక్షన్ లో పని చేయాలని ఉంది," అని చిరంజీవి కృష్ణవంశీ తో చెప్పటం అభిమానులను సైతం షాక్ కి గురిచేసింది.

ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న ఈ ఇద్దరు డైరెక్టర్ల కరియర్ ఏమాత్రం బాగాలేదు. ఈ సమయంలో ఒక్కసారి మెగాస్టార్ చిరు తో బ్లాక్ బస్టర్ పడితే కచ్చితంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు మెగాస్టార్ చిరంజీవిని తమ స్క్రిప్ట్లతో ఎప్పుడు మెప్పిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories