Sreekaram: శ్రీకారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి

Sreekaram Pre Release : శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ నటించిన 'శ్రీకారం' మూవీ ప్రీ రిలీజ్ ప్రోగ్రాం‌ నేడు ఖమ్మంలో జరగనుంది.

Venkata Chari
Updated on: 8 March 2021 4:15 PM IST
Mega Star Chiranjeevi Joins Sreekaram Pre Release Event at Khammam
X

శ్రీకారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్న చిరంజీవి

Sreekaram Pre Release: హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా నటించిన 'శ్రీకారం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సోమవారం ఖమ్మంలో జరగనుంది. ఈమేరకు శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ రోజు సాయంత్రం 6గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలవుతుందని, ముఖ్య అతిథిలుగా మెగాస్టార్‌ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ రానున్నారని పేర్కొన్నారు. డైరెక్టర్ డి.కిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీజే మేయర్, సినిమా టీం పాల్గొంటుందని అన్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఈవెంట్ కు రానిస్తామన్నారు.

కాగా, ప్రస్తుతం శర్వానంద్.. కిశోర్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా శ్రీకారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

శర్వానంద్ ఓపెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకొని.. రైతుగా మారి వ్యవసాయం చేసేందుకు పల్లెటూరుకు రావడం ట్రైలర్ లో చూపించారు. అలాగే సాయి కుమార్ ఇందులో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట తెరకెక్కించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్‌ను అందించగా.. ఈనెల శివరాత్రి సందర్బంగా 11న శ్రీకారం సినిమాను విడుదల చేయనున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story