Chiru - Jagan Meeting: బన్నీ, మహేష్ బాబుకి కబురు పంపిన మెగాస్టార్

* మెగాస్టార్ - జగన్ మీటింగ్ కు హాజరుకాబోతున్న స్టార్ హీరోలు

admin1
Updated on: 1 Sept 2021 5:30 PM IST
Mega Star Chiranjeevi Invites Allu Arjun And Mahesh Babu For Meeting With AP CM About Industry Problems
X

బన్నీ మరియు మహేష్ బాబుకి కబురు పంపిన మెగాస్టార్ (ఫైల్ ఫోటో)

Chiru - YS Jagan Meeting : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 4న వీరి మీటింగుకు తేదీ ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వీరిద్దరూ డిస్కస్ చేయబోతున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. జగన్ తో మీటింగ్ గురించి మెగాస్టార్ ఇప్పటికే కొందరు నిర్మాతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, సుప్రియ, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దాము తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

తాజా సమాచారం ప్రకారం జగన్ తో మీటింగ్ కు మెగా స్టార్ అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా పిలిచినట్లు తెలుస్తోంది. తనతోపాటు మరికొందరు స్టార్ హీరోలు ఉంటే బావుంటుందని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు అని సమాచారం. ఈ నేపథ్యంలోనే బన్నీ మరియు మహేష్ కి మెగాస్టార్ కబురు పంపారని సమాచారం. కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఖచ్చితంగా మెగాస్టార్ తో పాటు మీటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అది ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

admin1

admin1

Next Story