Chiranjeevi: రీమేక్ సినిమాతో ప్యాన్ ఇండియన్ ఇవ్వబోతున్న మెగాస్టార్

Chiranjeevi: అందుకే సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దింపిన చిరు

admin1
Published on: 13 Aug 2021 5:38 PM IST
Mega Star Chiranjeevi Going to be Pan India Star with Remake Movie
X

మెగాస్టార్ చిరంజీవి (ఫోటో ది హన్స్ ఇండియా)

Chiranjeevi: ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో "లూసిఫర్" సినిమా రీమేక్ తో బిజీగా ఉన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా "లూసిఫర్" రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో మోహన్లాల్ హీరోగా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్ర పోషించారు. అయితే తాజా సమాచారం ప్రకారం "లూసిఫర్" తెలుగు రీమేక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ ఒక ప్యాన్ ఇండియన్ అప్పీల్ ఇవ్వాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదించగా చిరుతో తనకున్న స్నేహం వల్ల సల్మాన్ ఖాన్ కూడా వెంటనే ఒప్పుకున్నారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్ లో అక్టోబర్ నుంచి పాల్గొననున్నారు. సల్మాన్ ఖాన్ ఎంట్రీ తో ఈ సినిమాకి బాలీవుడ్లో సైతం మార్కెట్ పెరుగుతుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ ప్రసాద్ మరియు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story