Chiranjeevi: ఓటీటీ లలో అడుగు పెట్టబోతున్న మెగాస్టార్

Chiranjeevi: వెంకటేష్, నాగార్జున ల రూట్ ఫాలో అవుతున్న చిరంజీవి

admin1
Published on: 18 Oct 2021 8:48 PM IST
Mega Star Chiranjeevi Going to be Enter in OTT
X

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫాం పైన క్రేజ్ బాగానే పెరిగినప్పటికీ, మహేష్ బాబు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు మాత్రం ఓటీటీ లకు దూరంగానే ఉంటున్నారు. కానీ మరోవైపు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం యువ హీరోలకే షాక్ ఇస్తూ ఓటీటీ వైపు వెళుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ వారు చిరంజీవిని ఈ మధ్యనే సంప్రదించారట. గంట వ్యవధి ఉండే ఒక వెబ్ సినిమాలో ముఖ్య పాత్ర కోసం చిరంజీవిని అడిగారట.

కానీ ఇప్పటికే చేతిలో చాలా ప్రాజెక్టులు ఉండటంతో కొత్త ప్రాజెక్టులు ఏమి ఒప్పుకోకూడదని చిరంజీవి అనుకున్నారు. అందుకే మొదట ఓటీటీ వారి ప్రపోసల్ రిజెక్ట్ చేశారట. కానీ వాళ్లు మళ్లీ సంప్రదించి ఈసారి భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పటంతో చిరంజీవి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు కోటి తమ సినిమాలను ఓటీటీ లలో కూడా విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే బాటలో ఆకట్టుకోనున్నారు.

admin1

admin1

Next Story