Acharya Movie: హైదరాబాద్ లో మొదలైన "ఆచార్య" షూటింగ్

Acharya Movie: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా చిన్న సినిమాలతో పాటు భారీ సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడటంతో తాజాగా

Sandeep Reddy
Published on: 7 July 2021 3:06 PM IST
Mega Star Chiranjeevi Acharya Movie Shooting Resumes in Hyderabad
X

ఆచార్య పోస్టర్ 

Acharya Movie: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా చిన్న సినిమాలతో పాటు భారీ సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడటంతో తాజాగా లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదల తేదీలు ప్రకటించి షూటింగ్ అలస్యంతో మరోమారు తేదీలను ప్రకటించబోతున్న భారీ బడ్జెట్ చిత్రాలు త్వరగా సినిమా షూటింగ్ లను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా స్టార్ హీరోగా నటిస్తున్న "ఆచార్య" చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో దాదాపుగా 15 రోజుల షూటింగ్ తో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హేగ్దే హీరోయిన్స్ గా నటించగా, రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఒక నక్సలైట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన "లాహే లాహే" సాంగ్ యూట్యూబ్ లో 6 కోట్ల 40 లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది. 140 కోట్ల బడ్జెట్ తో మ్యాట్నీ మూవీ మేకర్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story