Koratala Siva: మెగా హీరోలు వద్దనుకున్న కొరటాల కథలు...

Koratala Siva: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్నారు...

Shireesha
Published on: 23 April 2022 12:31 PM IST
Mega Heroes Rejected Koratala Siva Movies | Tollywood Gossips
X

Koratala Siva: మెగా హీరోలు వద్దనుకున్న కొరటాల కథలు...

Koratala Siva: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే నిజానికి కొరటాల శివ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా కూడా కొరటాల శివ ఒక సినిమా లైన్లో పెట్టారు.

కానీ ఆ సినిమా కూడా కొరటాల శివ చేతిలో నుంచి తప్పిపోయింది. అయితే ఈ రెండు సినిమా కథలను కొరటాల శివ లైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు అయితే దీనికోసం కొరటాల శివ అల్లు అర్జున్ లేక రామ్ చరణ్ కోసం రాసిన కథలు కాకుండా కొత్త కథని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మెగా హీరోలు వదులుకున్న ఈ సినిమా కథలు ఇప్పుడు ఎవరి చేతికి వెళ్తాయో ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ తో సినిమా కూడా పూర్తయిన తర్వాత కొరటాల శివ ఈ రెండు కథల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ వద్దనుకున్న ఈ కథలలో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి.

Shireesha

Shireesha

Next Story