Mega Heroes: 30 రోజుల్లో 4 సినిమాలతో మెగా హీరోల దాడి..!

Mega Heroes: జులై 28 నుంచి వరుసగా 30 రోజుల్లో ఐదుగురు మెగా హీరోలు దండెత్తబోతున్నారు.

Arun Chilukuri
Published on: 8 July 2023 10:07 AM IST
Mega Heroes Mega Treat to Mega Fans
X

Mega Heroes: 30 రోజుల్లో 4 సినిమాలతో మెగా హీరోల దాడి..!

Mega Heroes: జులై 28 నుంచి వరుసగా 30 రోజుల్లో ఐదుగురు మెగా హీరోలు దండెత్తబోతున్నారు. పవర్ స్టార్ నుంచి మెగా స్టార్ వరకు 30 రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ మెగా మూవీలతో దాడికి రెడీ అయ్యారు. ఐదుగురు మెగా హీరోలు, నాలుగు సినిమాలతో తగ్గేదిలేదంటున్నారు. ఫ్యాన్స్ కి షాకిచ్చే రేంజ్ లో కిక్ ఇవ్వబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మూవీల సీజన్ ని షురూ చేస్తున్నాడు. ఈనెల 28న బ్రో తో దండెత్తబోతున్నాడు. సాయితేజ్ తో కలిసి తను చేసిన ఈ మూవీ మంత్ ఎండ్ రీసౌండ్ చేయబోతోంది. బ్రోతో మొదలయ్యే మెగా హీరోల సందడి చిరు భోళా శంకర్ తో పీక్స్ కి చేరేలా ఉంది. ఆగస్ట్ 11 న చిరంజీవితో మోహర్ రమేష్ తీసిన భోళా శంకర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. నిజానికి 30 రోజుల గ్యాప్ లోనే వరుసగా 4 మెగా హీరోల సినిమా అంటే ఫ్యాన్స్ కి వన్ ప్లస్ 3 ఆఫర్ అనుకోవాల్సిందే.

ఆగస్ట్ 11 న చిరు మూవీ భోళా శంకర్ వస్తుంటే, వన్ వీక్ గ్యాప్ లో ఆగస్ట్ 18 కి ఆదికేశవ అంటూ వైష్ణవ్ తేజ్ మూవీ రాబోతోంది. మాస్ రూట్లో తను చేసిన తొలి ప్రయత్నం వచ్చే నెల్లోనే బాక్సాఫీస్ లో పరీక్షను ఎదుర్కోబోతోంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సత్తారు తీసిన మూవీ గాండీవ ధార అర్జున. ఈ సినిమా వచ్చేనెల్లోనే రాబోతోందట. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోందట.

ఎలా చూసినా పవన్ కళ్యాణ్, సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు చిరు ఇలా ఐదుగురు మెగా హీరోల సినిమాలు కేవలం 30 రోజుల్లో థియేటర్స్ ని ఊపేయబోతున్నాయంటే, అది నిజంగా కోఇన్స్ డెన్సే... ఒకరి మూవీ మరొకరికి ప్లాబ్లమ్ కాకుండా డేట్లు, ముహుర్తాలు బాగా కుదిరాయి. మెగా సందల్లు మొదలుకాబోతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story