ప‌క్క ఇండ‌స్ట్రీ క‌థ‌ల‌పై క‌న్నేసిన మెగా బ్ర‌ద‌ర్స్‌

రీమేక్ సినిమాలతో విసిగిస్తున్న హీరోలు

admin1
Updated on: 19 March 2022 9:30 PM IST
The Craze for Mega Heroes is Dwindling Due to Such Movies
X

అలాంటి సినిమాల వల్ల తగ్గిపోతున్న మెగా హీరోల క్రేజ్

Remake Movies: మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఓవర్సీస్ లో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోల కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచి సినిమాలను ఎప్పుడు ఆదరించే అభిమానులు తమ ఫేవరేట్ హీరోల సినిమాలను బ్లాక్ బస్టర్ చేయడంలో ముందుంటారు. కానీ గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి తమ అభిమానులను నిరాశపరుస్తూ ఉన్నారు. సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నప్పటికీ అభిమానులు మాత్రం వీరిద్దరి సినిమా ఎంపికలో ఏమాత్రం సంతోషంగా లేరు అని తెలుస్తోంది.

దీనికి కారణం గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి కేవలం రీమేక్ సినిమాలు మాత్రమే చేయడం. తమిళంలో విజయ్ హీరోగా నటించిన సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో "ఖైదీ నంబర్ 150" గా రీమేక్ చేస్తూ తన కమ్ బ్యాక్ ఇచ్చారు చిరంజీవి. మరో వైపు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన అందుకున్న సూపర్ హిట్ లు "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" రెండు రీమేక్ సినిమాలే. ఇక చిరంజీవి తదుపరి సినిమాలు గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ కూడా రీమేక్ సినిమాలే. అవే ఒరిజినల్ సినిమాలని ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో చూసే అవకాశం ఉన్నప్పుడు అదే కథని వేరే నటులతో చూడటానికి థియేటర్లకి ఎందుకు వెళ్లాలి అని అభిమానులు డైరెక్టుగానే ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ మెగా మెగా హీరోలు రీమేక్ సినిమాలో నుంచి బయటకు వస్తారో లేదో వేచి చూడాలి.

admin1

admin1

Next Story