Varun Tej New Movie: మైత్రి మూవీ మేకర్స్ లో వరుణ్ తేజ్ నెక్ట్ సినిమా?

Varun Tej New Movie: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపతి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం 'గని'తో బిజీగా ఉన్నారు.

Venkata Chari
Published on: 22 May 2021 5:11 PM IST
Mega Hero Varun Tej New Movie Ghani With Mythri Movie Makers
X
వరుణ్ తేజ్ (ఫొటో ట్విట్టర్)

Varun Tej New Movie: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపతి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం 'గని'తో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం, వరుణ్ తేజ్ తన తదుపరి మూవీ కోసం 'ఛలో', 'భీష్మా' ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుములతో జోడీ కడుతున్నారు. వరుణ్ తేజ్, వెంకీ కుడుముల కాంబోలో రొమాంటిక్ కామెడీగా రానున్నట్లు తెలుస్తోంది.

కథ విన్న వెంటనే వరుణ్.. ఓకే చేసినట్లు తెలుస్తోంది. కాగా, వెంకీ ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాను నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ రెడీ గా ఉందని సమాచారం.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఏడాది దసరా నుంచి సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story