హీరోయిన్ కి ప్రపోజ్ చేయబోతున్న మెగా హీరో.. ?

Mega Hero:ఈ మధ్యనే వరుణ్ తేజ్ 25 లక్షల విలువ చేసే ఒక ఉంగరాన్ని కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు కి వెళ్లి ఒక హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

admin1
Published on: 20 Jan 2022 12:00 PM IST
Mega Hero Varun Tej Marriage With Heroine?
X

హీరోయిన్ కి ప్రపోజ్ చేయబోతున్న మెగా హీరో.. ?

Mega Hero: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వరుణ్ తేజ్ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ వ్యక్తిగత జీవితానికి గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే వరుణ్ తేజ్ 25 లక్షల విలువ చేసే ఒక ఉంగరాన్ని కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు కి వెళ్లి ఒక హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మెగా కుటుంబానికి చెందిన ఏ పెళ్ళికాని హీరో గురించి ఈ పుకారు వచ్చిందో క్లారిటీ లేదు కానీ చాలామంది ఆ హీరో వరుణ్ తేజ్ అని అతను ప్రపోజ్ చేయడానికి సిద్ధమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి అని చెబుతున్నారు. పైగా ఇవాళ వరుణ్ తేజ్ పుట్టినరోజు కూడా. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ఇప్పటికే కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. వారి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. మరి వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమించుకుంటున్నారా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

admin1

admin1

Next Story