Tollywood News: పైలట్ గా మారనున్న మెగా హీరో...

Mega Hero Varun Tej Going to Play Pilot Role in His Next Movie | Live News
x

Tollywood News: పైలట్ గా మారనున్న మెగా హీరో...

Highlights

Tollywood News: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో మంచి హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్...

Tollywood News: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో మంచి హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ హీరోగా సోని పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమాని దర్శకనిర్మాతలు రూపొందించనున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ఫోర్స్ పైలెట్ గా కనిపించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ దాదాపు పూర్తయ్యింది. వరుణ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారు. ఇక ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ "ఎఫ్ 3" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories