మెగా హీరో సరసన మ్యూజికల్ షార్ట్ చేసిన కలర్స్ స్వాతి..

* స్వాతి తో మెగా హీరో మ్యూజికల్ షార్ట్.

Dhatripriya
Updated on: 27 Jan 2023 5:30 PM IST
Mega Hero Musical Short With Swathi
X

మెగా హీరో సరసన మ్యూజికల్ షార్ట్ చేసిన కలర్స్ స్వాతి..

Virupaksha: గత కొంతకాలంగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేని సంగతి తెలిసిందే. బైక్ ఆక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ "రిపబ్లిక్" సినిమా తప్ప మరే సినిమాతోనూ వెండితెరపై కనిపించలేదు. అయితే తాజాగా ఇప్పుడు సాయి ధరంతేజ్ ఒక మ్యూజికల్ షార్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మ్యూజికల్ షార్ట్ ఎంతోమంది నిజజీవిత హీరోలకు నివాళిగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

"ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ ఒక చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టుతో మీ ముందుకు రాబోతున్నారు. స్నేహితులు ఏదైనా కలిసి చేస్తే అది ప్రేమతో నిండి ఉంటుంది. మా ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకురావటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను," అంటూ సాయి ధరంతేజ్ ఈ మ్యూజిక్ షార్ట్ ను ప్రకటిస్తూ పోస్టర్ని కూడా విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ మరియు స్వాతి కౌగిలించుకుని ఉన్న ఈ పోస్టర్ చూస్తే ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక తమ మ్యూజికల్ షార్ట్ ను త్వరలోనే ఒక మంచి సందర్భం చూసుకొని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నవీన్ విజయ్ కృష్ణ ఈ మ్యూజికల్ షార్ట్ కు దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి మరియు హన్సిత ఈ ప్రాజెక్టు ను నిర్మించారు. శృతిరంజని సంగీతం అందించిన ఈ మ్యూజికల్ షార్ట్ కు బాలాజీ సుబ్రహ్మణ్యం సిరిమటోగ్రాఫర్ గా పనిచేశారు. అభిమానులు కూడా ఈ వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సాయిధరమ్ తేజ్ "విరూపాక్ష" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు.




Dhatripriya

Dhatripriya

Next Story