మెగా అభిమానులను కలవరపరుస్తున్న చిరు లైన్ అప్

చిరు సినిమాలు చూసి భయపడ్తున్న మెగా అభిమానులు

Arun Chilukuri
Published on: 25 Aug 2022 3:02 PM IST
Mega Fans Worried About the Chirus Line-up
X

మెగా అభిమానులను కలవరపరుస్తున్న చిరు లైన్ అప్

Chiranjeevi: ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక ఒక 10 ఏళ్ళు సినిమాల నుంచి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "ఖైదీ నెంబర్ 150" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ రేంజ్ హిట్ లను ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అందుకు ఉదాహరణ ఈ మధ్యనే విడుదలైన "ఆచార్య" సినిమా.

ఇప్పటిదాకా ఫ్లాప్ అంటే ఎరుగని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో భారీ అంచనాల మధ్య విడుదలైన "ఆచార్య" బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. "ఆచార్య" సినిమా రిజల్ట్ మెగా అభిమానులకు పెద్ద షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు చిరంజీవి లైన్ అప్ చూసి ఇంకా భయపడుతున్నారని సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అందులో వేటిపై కూడా ఎక్కువ అంచనాలు లేవు. ఒకవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసీఫర్" సినిమా తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్" తో బిజీగా ఉన్న మెగాస్టార్ "వాల్తేరు వీరయ్య", "భోళా శంకర్" సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story