మెగా అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్న బీ వీ రవి సెంటిమెంట్

Mega Fans in Tension With the Writer Entry
x

మెగా అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్న బీ వీ రవి సెంటిమెంట్ 

Highlights

*బివిఎస్ రవి సెంటిమెంట్ వల్ల కంగారులో ఉన్న మెగా అభిమానులు

BVS Ravi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా చిరు కరియర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. తాజాగా ఇప్పుడు మెగా అభిమానులను బీ వీ ఎస్ రవి సెంటిమెంట్ భయపెడుతోంది. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ స్క్రిప్ట్ రైటర్లలో బీ వీ ఎస్ రవి కూడా ఒకరు. చాలా సినిమాల స్క్రిప్ట్ లో బివిఎస్ రవి చేయి ఉంటుంది. కానీ ఈ మధ్య బివిఎస్ రవి స్క్రిప్ట్ అందించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ అవ్వట్లేదు.

మొదటగా "ఆచార్య" సినిమా డిజాస్టర్ ఆయన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే నాగచైతన్య హీరోగా విడుదలైన "థాంక్యూ" సినిమాకి కూడా బివిఎస్ రవి స్క్రిప్ట్ ని అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ని అందుకుంది. అయితే చిరంజీవి చేతిలో ఉన్న తదుపరి సినిమాలైన "భోళాశంకర్" మరియు "వాల్తేరు వీరయ్య" సినిమాలకు కూడా బీవీఎస్ రవి స్క్రిప్ట్ కూడా స్క్రిప్ట్ విషయంలో తలదురుస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల తలరాత ఎలా ఉంటుందో అని అభిమానులలో కంగారు మొదలైంది. మరోవైపు చిరంజీవి మెహర్ రమేష్ వంటి ఫ్లాప్ డైరెక్టర్ తో కూడా సినిమా సైన్ చేశారు. గాడ్ ఫాదర్ కూడా రీమేక్ సినిమానే. ఇలా చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క సినిమాపై కూడా మంచి అంచనాలు కలగటం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories