చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా ఆశలు లేవా?

చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా ఆశలు లేవా?

Rama Rao
Updated on: 6 May 2022 1:00 PM IST
Mega Fans are Worried about How the Result of Chiranjeevi Next Three Movies
X

చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా ఆశలు లేవా? 

Mega Fans: ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ మరియు మెగా పవర్ స్టార్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారి మెగా అభిమానులకు మరిచిపోలేని షాక్ గా మిగిలింది. ఇక ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ చిరంజీవి తదుపరి సినిమాల పై ఆశలు పెట్టుకున్నారు.

కానీ ప్రస్తుతం చిరంజీవి సినిమాల లైనప్ చూస్తే అభిమానులకి కొంచెం కంగారుగా ఉంది. చిరంజీవి హీరోగా మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. అందులో రెండు రీమేక్ సినిమాలే. అందులో మొదటిది మోహన్ రాజా డైరెక్షన్ లో "గాడ్ ఫాదర్" సినిమా. మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మరోవైపు గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న మెహర్ రమేష్ డైరెక్షన్ లో "భోళా శంకర్" సినిమా.

మరోవైపు చిరంజీవి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు బాబి డైరెక్ట్ చేసిన "వెంకీ మామ", "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు చాలా కంగారుగా ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story