Top
logo

డిసెంబర్ లో నిహారిక పెళ్లి.. ఎక్కడంటే?

డిసెంబర్ లో నిహారిక పెళ్లి.. ఎక్కడంటే?
X
Highlights

Niharika Wedding : త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మొగనున్న సంగతి తెలిసిందే.. మెగా డాటర్ నిహారిక పెళ్లి ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిహారిక నిశ్చితార్థం జరిగింది కూడా..

Niharika Wedding : త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మొగనున్న సంగతి తెలిసిందే.. మెగా డాటర్ నిహారిక పెళ్లి ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిహారిక నిశ్చితార్థం జరిగింది కూడా.. అయితే నిహారిక పెళ్ళికి సంబంధించి తాజాగా నాగబాబు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిహారిక పెళ్ళికి సంబంధించిన పనులను వరుణ్ తేజ్ చూసుకుంటున్నట్టుగా నాగబాబు వెల్లడించారు. డిసెంబర్ నెలలో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఉన్నట్టుగా అయన తెలిపారు. వెడ్డింగ్‌కు సంబంధించి వరుణ్‌ ఇప్పటికే కొన్ని ప్రాంతాల పేర్లతో లిస్ట్‌ సిద్ధం చేసినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు.

అటు నిహారిక పెళ్లి విషయంలో తామంతా సంతోషంగా ఉన్నట్టుగా నాగబాబు తెలిపారు. ఇక పెళ్ళికి సంబంధించిన డేట్ ని త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. నిహారిక పెళ్లి త్వరలోనే ఉంటుందని తెలియడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక నిహారికకి కాబోయే భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.

ఇక అటు మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.

Web TitleMega family plans to destination wedding for niharika
Next Story