Niharika: మెగా డాటర్ నిహారిక సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Niharika: నాగేంద్ర బాబు డాటర్ నిహారిక కొణిదెల చివరిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు.

Venkata Chari
Published on: 26 Feb 2021 9:12 PM IST
Mega Daughter Niharika Movie Release date Fix
X

నిహారిక (ఫోటో ట్విట్టర్ )

Niharika: నాగేంద్ర బాబు డాటర్ నిహారిక కొణిదెల చివరిగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో కనిపించారు. ఆ తరవాత వెంకట చైతన్యను పెళ్లాడారు. పెళ్లి తరవాత ఇక ఆమెను వెండితెరపై చూడటం కష్టమే అనుకుంటున్న మెగా ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్. నిహారికను మళ్లీ వెండితెరపై చూడబోతున్నారు. అయితే, ఇది తెలుగు సినిమా మాత్రం కాదు. తమిళ సినిమాకి డబ్బింగ్. నిహారిక నటించిన ఏకైక తమిళ సినిమా.

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్'. ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో విడుదలై సక్సెస్ అయ్యింది. 3 ఏళ్ల తరువాత ఈ మూవీని తెలుగులోకి డబ్బింగ్ చేసి 'ఓ మంచి రోజు చూసి చెప్తా' అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. 'ఓ మంచి రోజు చూసి చెప్తా' చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే హైలైట్ గా ఉంటుంది. నిహారిక ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగు ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీగా విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.

సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించగా, ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, వీజీ చంద్రశేఖర్, రమేష్ తిలక్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Venkata Chari

Venkata Chari

Next Story