నాని స్నేహితురాలిగా మెగా డాటర్?

Mega Daughter as Nani Friend?
x

నాని స్నేహితురాలిగా మెగా డాటర్?

Highlights

*మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న మెగా ప్రిన్సెస్

Niharika: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించడమే కాక నిర్మాత కూడా కొన్ని ప్రాజెక్టులు చేసిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు పూర్తిగా దూరమైంది. కానీ గత కొద్ది రోజులుగా నీహారిక విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ నీహారిక మరియు తన భర్త కు మధ్య విబేధాలు వచ్చాయని, అవి విడాకుల దాకా దారి తీశాయి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం నీహారిక తన పెళ్లి గురించి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయినా, ఇన్‌స్టాగ్రామ్ లో తన పోస్టులతో బాగానే సందడి చేస్తోంది. ఆమె మళ్లీ సినిమాల్లోకి రాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక తాజాగా ఒక తమిళ హీరోతో రొమాంటిక్ సినిమా సైన్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం, నీహారిక సినిమాలకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే #Nani30 దర్శకుడు నిహారిక కి మంచి మిత్రుడని మరియు ఇప్పుడు మెగా ప్రిన్సెస్ ఈ ప్రత్యేక ఒక క్యామియో పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. అందులో నీహారిక నాని ఆఫీసు లో ఉండే నాని స్నేహితురాలిగా కనిపించబోతుందట. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories