"స్వామిరారా" డైరెక్టర్ తో మెగా కాంబినేషన్

"స్వామిరారా" డైరెక్టర్ తో మెగా కాంబినేషన్

admin1
Updated on: 17 March 2022 5:30 PM IST
Mega Combination with Director Sudheer Varma | Telugu News Today
X

"స్వామిరారా" డైరెక్టర్ తో మెగా కాంబినేషన్

Sudheer Varma: వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "ఉప్పెన" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా "కొండపొలం" తో పర్వాలేదనిపించాడు. తాజాగా ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తో నే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వైష్ణవ్. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పట్నుంచో మెగాహీరోల కాంబినేషన్లో సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకి ఈ సినిమా నిజంగానే ఒక కన్నుల విందు కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. స్వామిరారా వంటి సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన సుధీర్ వర్మ ఆ తర్వాత దోచేయ్, కేశవ వంటి సినిమాలతో పర్వాలేదనిపించాడు. తాజాగా ఇప్పుడు సుదీర్ వర్మ పవన్ కళ్యాణ్ మరియు వైష్ణవ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

admin1

admin1

Next Story