Mega Brothers: మెగా బ్రదర్స్.. రీ ఎంట్రీ అదుర్స్

Mega Brothers: మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో బాక్సాఫీస్ బద్దలు

Sandeep Eggoju
Published on: 17 April 2021 12:27 PM IST
Mega Brothers Chiranjeevi and Pawan Kalyan Re-entry into the Movies has Given Them Huge Success
X

చిరంజీవి మరియి పవన్కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Mega Brothers: ఎవరైనా హీరోలు సినిమాలకు బ్రేక్ ఇస్తే ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గుతోంది. మరో వైపు సినిమా మార్కెట్ కూడా డల్ అవుతుంది. కానీ ఆ ఇద్దరు హీరోలకు మాత్రం రీ ఎంట్రీ బాగా కలిసోచ్చింది. ఇంతకీ ఆ స్టార్ లు ఎవరు ?

టాలీవుడ్ లో చాలామంది హీరోలు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రీ ఎంట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. కానీ మెగా బ్రదర్స్ కు మాత్రం రీ ఎంట్రీ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో బాక్సాఫీస్ బద్దలుకొట్టారు.

చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఏడేళ్ల గ్యాప్ వచ్చినా మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఖైదీ నెంబర్ 150 సాధించిన కలెక్షన్స్ ఉదాహారణ. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆచార్యతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగాస్టార్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ణాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ పింక్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఎవరి మాట ఏమోగాని మెగా బ్రదర్స్ రీ ఎంట్రీ మాత్రం అదుర్స్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story