Naga Babu: మీరు షాక్ అవుతారనే రోజా పేరు చెప్పా: నాగబాబు

Naga Babu: జబర్దస్త్ కమెడియన్స్‌లో బెస్ట్ కమెడియన్ రోజా అని మెగా బ్రదర్ నాగబాబు బాంబు పేల్చిన విషయం తెలిసిందే.

Venkata Chari
Published on: 22 March 2021 2:49 PM IST
Mega Brother Naga Babu Shocking Comments on Roja
X

రోజా, నాగబాబు (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Naga Babu: జబర్దస్త్ కమెడియన్స్‌లో బెస్ట్ కమెడియన్ రోజా అని నాగబాబు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడంతో పాటు కొన్ని కాంట్రవర్సీలకు దారితీసింది.

జబర్దస్త్ జడ్జ్‌లుగా నాగబాబు- రోజా చాలా కాలంగా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. జడ్జ్‌లపై జబర్దస్త్ కమెడియన్స్ ఎన్ని పంచులేసినా సరదాగా తీసుకుంటూ ఆ షో పాపులర్ కావడంలో కీలక భూమిక పోషించారు. అయితే రీసెంట్‌గా మల్లెమాల టీంకు గుడ్ బై చెప్పి.. సోషల్ మీడియాలో కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నాగబాబు. రోజాపై నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీశాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి రియాక్ట్ అయ్యారు నాగబాబు.

సోషల్ మీడియా వేదికగా 'మీమర్స్‌' లైవ్‌లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు నాగబాబు. ఈ సందర్భంగా ఆయన ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు. కమెడియన్ అనగానే ఎవరైనా గెటప్ శ్రీను లాంటి వాళ్ల పేర్లు చెబుతాను అని అనుకుంటారు. అందుకే వెరైటీగా ఉంటుందని, మీ లాంటి వాళ్లు (మీమర్స్) షాక్ అవుతారని రోజా పేరు చెప్పానంటూ బాంబ్ పేల్చారు నాగబాబు. అలాగే ఈ మధ్య రోజా పంచులు కూడా బాగానే పేలుస్తున్నారు అని, అందుకే ఇలా చెప్పానని ఆయన అన్నారు. తమ మధ్య కొంతమేర రాజకీయపరమైన విబేధాలున్నా.. వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని నాగబుబు చెప్పారు.

కాగా, ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన నాగబాబు.. నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలపై స్పందించారు. ఈ క్రమంలో ''సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రిప్లైగా జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న 'రోజా' అంటూ.. ఆమె ఫొటో షేర్ చేశారు. దాంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story