నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశం

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశం
x
Highlights

Meera Mitun: బిగ్ బాస్ ఫేమ్‌ నటిని అయిన మీరా మిథున్ అరెస్టుకు చెన్నై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెపై పలు మోపిన అభియోగాల నేపథ్యంలో, చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఈ నెల 11న కోర్టులో హాజరుపరచాలని తాజా ఆదేశాలు ఇచ్చాయి.

2021లో అరెస్ట్ – 2022లో ఎన్బీడబ్ల్యూ

2021 ఆగస్టులో వీసీకే తరఫున లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదుతో, మీరా మిథున్ మరియు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్లపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఇద్దరినీ అరెస్టు చేసి నెలరోజులకు బెయిల్‌పై విడుదల చేశారు.

అయితే తర్వాత కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో, 2022లో మీరా మిథున్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమెను పట్టుకోవటంలో విఫలమయ్యారు.

తల్లి పిటిషన్ – ఢిల్లీ పోలీసుల సమాచారం

ఇటీవల మీరా మిథున్ తల్లి, ఆమె ఢిల్లీ వీధుల్లో తిరుగుతోందని, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందు, పోలీసుల తరఫున న్యాయవాది మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు రక్షించి హోంకి తరలించారని వెల్లడించారు.

ఈ వివరాలపై స్పందించిన న్యాయమూర్తి, చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను ఢిల్లీ హోం నుంచి అరెస్టు చేసి, ఆగస్ట్ 11న కోర్టు ఎదుట హాజరు పరచాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories