Matinee Entertainment : కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన 'ఆచార్య' నిర్మాతలు

Matinee Entertainment : తెలుగులో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ

Krishna
Published on: 8 Sept 2020 12:17 PM IST
Matinee Entertainment : కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన ఆచార్య నిర్మాతలు
X

Matinee Entertainment new movie announced with director Swaroop RSJ

Matinee Entertainment : తెలుగులో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో 'క్షణం' 'ఘాజీ' 'గగనం' వంటి చిత్రాలు వచ్చాయి.. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో వైల్డ్ డాగ్ చిత్రాలను నిర్మిస్తోంది ఈ సంస్థ.. అయితే తాజాగా మరో విభిన్నమైన చిత్రానికి నిర్మించడానికి సిద్దం అయింది.

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో మంచి హిట్ కొట్టి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న స్వరూప్ ఆర్ఎస్జె తో ఓ సినిమాని చేస్తునట్టుగా ఆఫీషియల్ ఫా అనౌన్స్ చేసింది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్.. స్వరూప్ కి ఇది రెండవ సినిమాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి ఇది ఎనమిదో చిత్రం.. సినిమాని అనౌన్సు చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్..

ఈ పోస్టర్ లో ఓ గోడ పై కోడిపుంజు నిలుచొని ఉండగా గోడపై వాంటెడ్ పోస్టర్ అతికించబడి ఉంది. అతన్ని పట్టుకున్న వారికి 50 లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. దీనితో మరో విభిన్నమైన కథతో దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జె ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను త్వరలో వెల్లడించనున్నారు. డిసెంబర్ లో సినిమా పట్టాలెక్కనుంది.

అటు మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ కరోనా వలన వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో పాటుగా కొణిదెల ప్రొడక్షన్ కూడా నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. అటు వైల్డ్ డాగ్ చిత్రం ఇప్పటికే మొదలైంది.

Krishna

Krishna

Next Story