RT68 : డిటెక్టివ్ పాత్రలో అలరించబోతున్న మాస్ మహారాజా

Ravi Teja: త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయనున్నట్టు సమాచారం

admin1
Updated on: 8 Oct 2021 5:36 PM IST
Mass Maharaja Ravi Teja Going to Play the Detective Role in Direction of Trinadha Rao Nakkina Movie
X

త్రినాథ రావు నక్కిన తో సినిమా చేయనున్న రవితేజ (ఫైల్ ఇమేజ్)

Ravi Teja: వరుస డిజాస్టర్ సినిమా లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన రవితేజ ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రవితేజ మరో వైపు శరత్ మండవ దర్శకత్వం లో "రామారావు ఆన్ డ్యూటీ" తో కూడా బిజీ అయ్యారు. అయితే రవితేజ మరొక దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట.

తాజా సమాచారం ప్రకారం రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి "చంటబ్బాయి" అనే ఆసక్తికరమైన టైటిల్ను అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇందులో రవితేజ మార్క్ కామెడీ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

admin1

admin1

Next Story