తమిళ దర్శకుడితో మాస్ మహారాజ్

Ravi Teja: *మాస్ డైరెక్టర్ తో డిస్కషన్స్ లో ఉన్న మాస్ మహారాజా

Sriveni Erugu
Updated on: 15 May 2022 7:30 PM IST
Mass Maharaja joins hands with Kollywood director
X

కోలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న మాస్ మహారాజా

Ravi Teja: "కాధలిల్ సోధప్పువదు ఎప్పడి" (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు డైరెక్టర్ గా పరిచయం అయిన బాలాజీ మోహన్ ధనుష్ హీరోగా నటించిన "మారి" మరియు "మారి 2" సినిమాలతో మంచి పేరు సంపాదించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలాజీ మోహన్ ఒక తెలుగు హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తెలుగు హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్యనే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కిలాడీ సినిమాతో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం రవితేజ డైరెక్టర్ బాలాజీ మోహన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కథ గురించి డిస్కషన్ లు జరుగుతున్నాయి. ఒకవేళ రవితేజకి కథ నచ్చి ఈ సినిమాను ఓకే చేస్తే వీరిద్దరి మధ్య కాంబినేషన్ క్రేజీ గా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. బాలాజీ మోహన్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా రవితేజ కి ఒక పక్కా మాస్ రోల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు, మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story