జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ : మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త కామెంట్స్ వైరల్..

Ram Charan: మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త చియో హోడారి కోకర్..

Arun Chilukuri
Published on: 28 July 2022 7:48 PM IST
Marvel Creator Thinks Ram Charan Makes for a Good James Bond
X

జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ : మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త కామెంట్స్ వైరల్..

Ram Charan: మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త చియో హోడారి కోకర్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ లో జెమ్స్ బాండ్ గా డేనియల్ క్రెయిగ్ నిష్క్రమణ తర్వాత ఐకానిక్ మూవీ సిరీస్‌లో జేమ్స్ బాండ్‌గా చూడాలనుకుంటున్న నటీనటుల పేర్లను వెల్లడిస్తూ ఒక వార్తను పంచుకున్నారు. తాను చేసిన ట్వీట్‌లో, ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడె, డామ్సన్ ఇద్రిస్ మరియు రామ్ చరణ్‌లను పేర్కొన్నాడు. ‌వీరందరు కూడా జేమ్స్ బాండ్ పాత్రకు సూట్ అవుతారని పెర్కొన్నాడు.

అ ట్వీట్ వెరైల్ కావటంతో కోకర్ స్పందించాడు. ప్రతి ఒక్కరికి ఇద్రిస్ గురించి తెలుసు కానీ, "గ్యాంగ్స్ ఆఫ్ లండన్"లో సోప్, "ది ఆఫర్"లో మాథ్యూ జి, "స్నోఫాల్"లో డామ్సన్ మరియు "ఆర్ఆర్ఆర్"లో రామ్ చరణ్ జేమ్స్ బాండ్ పాత్రకు అంతే పోటీ ఇవ్వగల నటులన్నాడు. ఇక తదుపరి జేమ్స్ బాండ్ పాత్రకు టామ్ హార్డీ, హెన్రీ కావిల్, ఇద్రిస్ ఎల్బా అలాగే యుఫోరియా స్టార్ జాకబ్ ఎలోర్డి వంటి నటుల పేర్లు హాలీవుడ్ మీడియా లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story