Prabhas: "పక్కా కమర్షియల్" రిజల్ట్ కి ఉలిక్కిపడ్డ ప్రభాస్

Prabhas: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న ప్రభాస్...

Arun Chilukuri
Updated on: 2 July 2022 3:30 PM IST
Maruthis Pakka Commercial Tension in Prabhas
X

Prabhas: "పక్కా కమర్షియల్" రిజల్ట్ కి ఉలిక్కిపడ్డ ప్రభాస్

Prabhas: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" మరియు ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా సందీప్ వంగ డైరెక్షన్ లో "స్పిరిట్", నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్టు కే" వంటి సినిమాలు కూడా సైన్ చేసిన ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ఒప్పుకున్నారు.

"రాజా డీలక్స్" అనే టైటిల్ తో ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రభాస్ ని ఇటువంటి ఎంటర్టైనింగ్ సినిమాల్లో చూసి చాలా కాలం అవ్వడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ మరియు రాశిఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటించిన "పక్కా కమర్షియల్" సినిమా మంచి బజ్ తో జూలై 1 న విడుదలైంది. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొంటూ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లను నమోదు చేసుకుంటుంది.

కొన్ని కామెడీ సీన్స్ సన్నివేశాలు వర్కౌట్ అయినప్పటికీ సినిమా మాత్రం చాలా రొటీన్ గా బోరింగ్ గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చూసి ప్రభాస్ కూడా బాగా నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా మారుతీ దర్శకత్వం వహించిన పెద్ద హీరోలు నాని మరియు వెంకటేష్ మాత్రమే. కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో మారుతి మంచి సినిమా తీయగలడా అని ఇప్పుడు అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story