Maruthi: కోవిడ్ కామెడీ కాన్సెప్టుతో అలరించనున్న మారుతి

Maruthi: భిన్నమైన కథలతో కామెడీ పండించడంలో దర్శకుడు మారుతి దిట్ట అని చెప్పుకోవాలి.

admin1
Published on: 5 Aug 2021 3:28 PM IST
Maruthi to Entertain with Covid Comedy Concept
X

Maruthi: కోవిడ్ కామెడీ కాన్సెప్టుతో అలరించనున్న మారుతి

Maruthi: భిన్నమైన కథలతో కామెడీ పండించడంలో దర్శకుడు మారుతి దిట్ట అని చెప్పుకోవాలి. ఒక వైపు హీరో ఎలివేషన్ లు అంటూ మాస్ దర్శకులు ముప్పతిప్పలు పడుతుంటే మరోవైపు మారుతి మాత్రం కథలో హీరో కే ఏదో ఒక జబ్బు పెట్టి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేస్తున్నాడు. "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన మారుతి ఇప్పుడు "మంచిరోజులు వచ్చాయి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో "మహానుభావుడు" సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహరీన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన "ఏక్ మినీ కథ" ఫేమ్ సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే క్యాప్షన్ ద్వారా తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం కరోనా సమయంలో భిన్న ప్రవర్తనల ఆధారంగా ఈ సినిమా లోని పాత్రలు ఉండబోతున్నాయట. చూస్తూ ఉంటే ఈ సినిమాతో కూడా మారుతి పెద్ద హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు అంటున్నారు.

admin1

admin1

Next Story