Maruthi: ప్రభాస్ తో సర్ప్రైజ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన మారుతి

Maruthi Planned A Surprise Schedule With Prabhas
x

Maruthi: ప్రభాస్ తో సర్ప్రైజ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన మారుతి

Highlights

Maruthi: సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్న మారుతి

Maruthi: చేతినిండా బోలెడు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోవైపు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "రాజా డీలక్స్" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అయితే చాలా సైలెంట్ గా మారుతి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 40 రోజుల షూటింగ్ పూర్తి చేసేసారు. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్ తో ఇంత సైలెంట్ గా షూటింగ్ చేయటం ఇది నిజంగా మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

గతంలో ఈ సినిమా ప్రకటించినప్పుడు "పక్కా కమర్షియల్" సినిమా అప్పుడే ఫ్లాప్ అవడంతో మారుతి వంటి డైరెక్టర్ తో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఏంటి అని అభిమానులు ట్రోల్ చేశారు. అందుకే కాబోలు మారుతి ఈ సినిమా షూటింగ్ ను సీక్రెట్ గానే ఉంచుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో 19వ సెంచరీ బిల్డింగ్ సెట్ ని నిర్మించింది. ఫారెన్ నుంచి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా కోసం మరొక పది రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్ తో పాటు మిగతా హీరోయిన్లు కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఎంత ట్రోల్స్ చేస్తున్నా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని కొందరు అభిమానులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. పైగా ఇప్పటి దాకా మారుతి ఒక్క పెద్ద స్టార్ తో కూడా సినిమా చేయలేదు. మరి ఈ సినిమా తన కెరీర్ కి ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories