Maruthi: మెగా హీరో పై ఆశలు పెట్టుకున్న మారుతి?

Maruthi: మెగా హీరో పై ఆశలు పెట్టుకున్న మారుతి?

Rama Rao
Updated on: 9 July 2022 3:01 PM IST
Maruthi is Planning a Movie With Mega Hero Sai Dharam Tej | Tollywood News
X

 మెగా హీరో పై ఆశలు పెట్టుకున్న మారుతి?

Maruthi: ప్రముఖ డైరెక్టర్ మారుతీ ఈ మధ్యనే "పక్కా కమర్షియల్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. గోపీచంద్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 1న థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కథ చాలా రొటీన్ గా ఉంది అంటూ అభిమానులు సైతం విమర్శలు కురిపించారు.

అటు కామెడీ కానీ ఇటు కంటెంట్ కానీ ఏది సినిమాకి వర్కౌట్ అవ్వలేదు అంటూ ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ మారుతీ తదుపరి సినిమాపై కూడా పడుతుంది అని ప్రభాస్ అభిమానులు కంగారు పడుతున్నారని సమాచారం. ఇక మారుతి తదుపరి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే చేయాల్సింది. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. సినిమా స్క్రిప్ట్ బాగానే అనిపించినప్పటికీ "పక్కా కమర్షియల్" సినిమా రిజల్ట్ వచ్చేదాకా ప్రభాస్ ఎదురు చూడాలని అనుకున్నారు.

తీరా చూస్తే "పక్కా కమర్షియల్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మారుతి తన తదుపరి సినిమా కోసం మరొక హీరోని వెతకడం మొదలు పెట్టారట. ఈ మధ్యకాలంలో చేతిలో పెద్ద సినిమాలు లేని హీరో సాయి ధరమ్ తేజ్. మంచి కథ ఉంటే తేజ్ కచ్చితంగా సినిమా చేస్తారు. ఈ నేపథ్యంలోనే మారుతి మెగా హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story