రూ. 30 కోట్లతో తీస్తే రూ. 100 కోట్లు రాబట్టింది.. ఓటీటీలోకి రానున్న మూవీ..!

Marco Movie Gets RS 100 Crore Collections With Making Just RS 30 Crores
x

రూ. 30 కోట్లతో తీస్తే రూ. 100 కోట్లు రాబట్టింది.. ఓటీటీలోకి రానున్న మూవీ..!

Highlights

Violent Film: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. యానిమల్‌, స్త్రీ2 వంటి చిత్రాలు ఇదే జాబితాలోకి వస్తాయి.

Violent Film: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. యానిమల్‌, స్త్రీ2 వంటి చిత్రాలు ఇదే జాబితాలోకి వస్తాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ సినిమానే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తిమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టింది.

ఆ చిత్రం మరెదో కాదు మార్కో. ది మోస్ట్ వయలెంట్ మూవీగా మార్కో గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్‌లో భారీ విజయాన్ని అందుకున్న మార్కో ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 20వ తేదీన థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

థియేటర్లలోకి వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ లెక్కన మార్కో చిత్రం ఈ నెలఖారులో లేదా ఫిబ్రవరి తొలి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు.

కాగా మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికేట్‌ను అందించింది. అయినా కూడా వసూళ్ల వర్షం కురిపించిందీ మూవీ. కాగా ఈ చిత్రాన్ని కన్నడలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కన్నడలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలోకి వస్తందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories