Naga Chaitanya - Akhil: ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు అందుకున్న చైతూ, అఖిల్‌

*తనయుల సినిమాలను ప్రేక్షకులు ఆదరించడంతో నాగ్‌ ఫుల్‌ హ్యాపీ *అక్కినేని వారికి లక్కీ ప్రొడ్యూసర్‌గా మారిన నిర్మాత బన్నీవాసు

admin1
Updated on: 26 Oct 2021 2:34 PM IST
Bunny Vasu is the Lucky Producer for Akkineni Family
X

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు అందుకున్న చైతూ, అఖిల్‌(ఫైల్ ఫోటో)

Naga Chaitanya - Akhil: కింగ్‌ నాగార్జున తనయులు ఇద్దరు ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలిలో పండుగ వాతావరణం నెలకొంది. అన్నదమ్ములు బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాల్ని బాక్సాఫీసులో నమోదు చేయడంతో నాగార్జున హ్యాపీగా ఉన్నారు. సెకండ్‌ లాక్‌డౌన్‌ తర్వాత పూర్తి తరహాలో థియేటర్లకి ప్రేక్షకుల్ని ఆకర్షించిన చిత్రంగా నాగచైతన్య నటించిన లవ్‌స్టోరీ రికార్డులు సొంతం చేసుకుంది.

అఖిల్‌ నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన మూడ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌, జీఏ2పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందిన ఈ సినిమా సక్సెస్‌ అవ్వడంతో అక్కినేని ఫ్యామిలీలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి.

నాగ చైతన్య కెరీర్‌ స్టార్ట్ చేసిన కొత్తలో ఆయనకు టర్నింగ్‌ పాయింట్‌ సినిమాగా 100 పర్సెంట్‌ లవ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2పిక్చర్స్‌ వారే నిర్మించారు. ప్రస్తుతం అఖిల్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ తెరకెక్కించి సూపర్‌ సక్సెస్‌ అందించారు. దీంతో నిర్మాత బన్నీ వాసు అటు చైతూకి, అఖిల్‌కి లక్కీ ప్రొడ్యూసర్‌గా మారారు.

admin1

admin1

Next Story