Mani Ratnam: పొన్నియన్ రికార్డు బ్రేక్.. ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా?

Mani Ratnams Ponniyin Selvan Part 1, 2 sold for Rs 125 crore to Amazon Prime
x

Mani Ratnam: పొన్నియన్ రికార్డు బ్రేక్.. ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా? 

Highlights

Mani Ratnam: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్-1 మొదటి భాగం ఈనెల 30న విడుదల కానుంది.

Mani Ratnam: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్-1 మొదటి భాగం ఈనెల 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు మణిరత్నం. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పొన్నియన్ సెల్వన్ చిత్రానికి సంబంధించిన డిజటల్ హక్కులను ప్రముఖ ‌ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. రెండు పార్టులకు కలిపి సమారు 125 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు 20 కోట్లకు అమ్ముడుపోయాయి. రోజు రోజుకు ఈ చిత్రంపై క్రేజ్ పెరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories