అందుకే త్రిష, ఐశ్వర్య రాయ్ లను కలవనివ్వలేదు అంటున్న మణిరత్నం

Ponniyin Selvan: తమిళ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పొన్నియిన్ సెల్వన్".

Arun Chilukuri
Published on: 24 Sept 2022 5:15 PM IST
Mani Ratnam Warning To Trisha & Aishwarya Rai
X

అందుకే త్రిష, ఐశ్వర్య రాయ్ లను కలవనివ్వలేదు అంటున్న మణిరత్నం

Ponniyin Selvan: తమిళ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పొన్నియిన్ సెల్వన్". ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక పౌరాణిక చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చాలా మంది సినీ ప్రముఖులు, స్టార్ నటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లు మరియు ఇంటర్వ్యూలతో మణిరత్నం చాలా బిజీగా ఉన్నారు. నటీనటులతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఐశ్వర్య రాయ్ మరియు త్రిషల మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా సమస్యలు వచ్చాయట. సినిమాలో సన్నివేశాల ప్రకారం ఇద్దరూ ఎదురు పడ్డ సమయంలో చాలా సీరియస్ గా ఉండాలట. కానీ అలా ఉండేందుకు వారికి కాస్త కష్టం అయ్యిందని అన్నారు మణి రత్నం. "వారిద్దరి మధ్య సన్నివేశాల్లో చాలా సీరియస్ నెస్ ను తీసుకు రావడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిద్దరిని కలవనివ్వలేదు. ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కలవకూడదు" అని మణి రత్నం వార్నింగ్ ఇచ్చారట. ఇక సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అద్భుతం గా వచ్చింది అని వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా విడుదల కాబోతుంది అని చిత్ర బృందం చెబుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story