Mani Ratnam: "బాహుబలి నా ఇన్స్పిరేషన్" అంటున్న మణి రత్నం

Mani Ratnam: "బాహుబలి నా ఇన్స్పిరేషన్" అంటున్న మణి రత్నం

admin1
Updated on: 10 April 2022 9:01 PM IST
Mani Ratnam Said that the Film Bahubali was my Inspiration
X

 "బాహుబలి నా ఇన్స్పిరేషన్" అంటున్న మణి రత్నం 

Mani Ratnam: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరు. ఫీల్ గుడ్ ప్రేమకథలు తీయడంలో మణిరత్నం కి పోటీ లేరు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న మణిరత్నం కమల్హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ లతో సినిమాలు చేశారు.

అయితే గత కొంత కాలంగా డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి సినిమా అయినా "పోన్నియిన్ సెల్వన్" పైన దృష్టి పెట్టారు. ఈ సినిమా గురించి మాత్రమే ఆలోచనలు చేస్తున్న మణిరత్నం ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే రాజమౌళి తీస్తున్న బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలో చూసిన తర్వాత మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలని నిర్ణయించుకున్నారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తనకి అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని మణిరత్నం చెప్పుకొచ్చారు.

admin1

admin1

Next Story