వాయిదా పడ్డ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

Mani Ratnam Dream Project Was Postponed
x

వాయిదా పడ్డ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 

Highlights

* వాయిదా పడిన "పొన్నియిన్ సెల్వన్ 2"

Ponniyin Selvan 2: తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా "పొన్నియిన్ సెల్వన్" భారీ అంచనాల మధ్య గతేడాది సెప్టెంబర్ లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాకి రెండవ భాగమైన "పొన్నియిన్ సెల్వన్: 2" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తయింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది అని చిత్ర బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు వేసవి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాలవల్ల "పొన్నియిన్ సెల్వన్: 2" సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది. చోళులు మరియు పాండ్యుల మధ్య జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, జయం రవి, విక్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories