Nikhil Siddharth: నిఖిల్ కు మద్దతు పలికిన మంచు విష్ణు

Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న "కార్తికేయ 2" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Arun Chilukuri
Updated on: 2 Aug 2022 6:00 PM IST
Manchu Vishnu Support to Hero Nikhil on Karthikeya 2 Release Issue
X

Nikhil Siddharth: నిఖిల్ కు మద్దతు పలికిన మంచు విష్ణు

Karthikeya 2: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న "కార్తికేయ 2" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్ అయిన "కార్తికేయ" సినిమాకి సీక్వల్ గా తెరకెక్కనుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పలు కారణాలవల్ల ఎప్పటికప్పుడు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతుంది అని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అని ఇంకా కన్ఫ్యూషన్ నడుస్తూనే ఉంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని సినిమా కాబట్టి తన సినిమాని అందరూ పక్కకు తోసేస్తున్నారని అక్టోబర్ లేదా నవంబర్ కి కూడా వాయిదా వేయమని చాలా మంది బెదిరించారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు నిఖిల్.

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడైన మంచు విష్ణు నిఖిల్ కు మద్దతుగా నిలిచారు. "బ్రదర్ నిఖిల్.. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. స్ట్రాంగ్ గా ఉండు. అందరూ అన్నట్టుగానే కంటెంట్ ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది. కార్తికేయ 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నాను," అని చెప్పవచ్చారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో నిఖిల్ కూడా "విష్ణు భాయ్.. నీ మాటలు నాకు మరియు మా టీం కి చాలా విలువైనవి," అని రిప్లై ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story