తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ చేయి కలిపిన మంచు విష్ణు

తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ చేయి కలిపిన మంచు విష్ణు
x
Highlights

2007లో విడుదలైన 'ఢీ' సినిమాతో మొట్టమొదటి హిట్ ని అందుకున్నాడు మంచు విష్ణు. ఆ తర్వాత మళ్ళీ చాలా సినిమాలు చేసాడు కానీ అందులో కొన్ని మాత్రమే హిట్...

2007లో విడుదలైన 'ఢీ' సినిమాతో మొట్టమొదటి హిట్ ని అందుకున్నాడు మంచు విష్ణు. ఆ తర్వాత మళ్ళీ చాలా సినిమాలు చేసాడు కానీ అందులో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. ఇక గత కొంతకాలంగా మంచు విష్ణు నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. 'ఆచారి అమెరికా యాత్ర' అనే సినిమాలో కనిపించిన మంచు విష్ణు తాజాగా 'ఢీ' సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల తో సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ మధ్యనే తిరుపతి వెళ్ళిన మంచువిష్ణు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు.

'ఢీ' దర్శకుడు శ్రీను వైట్ల తో తాను ఒక సినిమా చేయబోతున్న వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. 'ఢీ' సినిమా తరువాత దాదాపు 12 ఏళ్ల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విష్ణు. అయితే ఈ సినిమా 'ఢీ' కి సీక్వెల్ గా తెరకెక్కనుందని అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మంచు విష్ణు స్వయం గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన మంచు విష్ణు 'ఓటర్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories