Manchu Vishnu: ''మా'' కుటుంబాలు ఎప్పటికీ అలానే ఉంటాయి అంటున్న మంచు విష్ణు

*త్వరలోనే చిరంజీవి అంకుల్ ని కలవబోతున్నాను-మంచు విష్ణు *మా కుటుంబాల మధ్య స్నేహం ఎప్పటికీ అలానే ఉంటుంది

admin1
Updated on: 19 Oct 2021 11:42 AM IST
Manchu Vishnu says that in an Interview Friendship Between MAA Families Forever
X

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

Manchu Vishnu: చాలా కాలంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈమధ్యనే ముగిసాయి. హీరో మరియు నిర్మాత అయిన మంచు విష్ణు "మా' కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఎన్నికలలో ఘన విజయం సాధించిన మంచు విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తన విజయానికి కారణం ఎవరు అని అడగగా తన తండ్రి మోహన్ బాబు ఎల్లప్పుడు తన వెన్నంటే ఉన్నారని, ఎప్పటికప్పుడు తనకి సలహాలు ఇచ్చి తనను ముందుకు నడిపారు అని చెప్పిన మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీ నుంచి తన స్నేహితులు కూడా అతనికి బాగా సపోర్ట్ చేశారు అని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత చిరంజీవి మాట్లాడారా అని అడగగా "చిరంజీవి గారు ఇప్పటికీ మా నాన్నగారికి చాలా క్లోజ్. మొదట్లో కొంచెం బాధ అనిపించినప్పటికీ నేను గెలుస్తానని తర్వాత నా పనిని అందరు మెచ్చుకుంటారు అని నాకు నమ్మకం ఉంది. త్వరలోనే చిరంజీవి అంకుల్ ని కలవబోతున్నాను. మా కుటుంబాల మధ్య స్నేహం ఎప్పటికీ అలానే ఉంటుంది" అని అన్నారు మంచు విష్ణు. అంతే కాకుండా మోహన్ బాబుకి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసని అందుకే ఆయనలో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడని చెప్పిన మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కూడా త్వరలోనే తనతో చేతులు కలపనున్నారని క్లారిటీ ఇచ్చారు.

admin1

admin1

Next Story