MAA Elections 2021: చిరంజీవి నన్ను విత్‌డ్రా చేసుకోమన్నారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 11 Oct 2021 8:44 PM IST
Manchu Vishnu Reveals Unknown Fact About Chiranjeevi
X

MAA Elections 2021: చిరంజీవి నన్ను విత్‌డ్రా చేసుకోమన్నారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు. నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. అయితే మా ఎన్నికల్లో విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏకగ్రీవం చేసేందుకు ఆయన నన్ను పోటీ నుండి తప్పుకోమన్నారు. ఈ విషయం చెప్పకూడదునుకున్నా. కానీ ఎన్నికలు అయిపోవడం వల్ల చెబుతున్నాను. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు.. కానీ అతను ఓటు ప్రకాష్ రాజ్ కే వేసి వుంటాడు. వాళ్ల నాన్న మాటను చరణ్ జవదాటడు. నాగబాబు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలి. ఆయన రాజీనామాను ఆమోదించను. గెలుపోటములు సహజం అని మంచు విష్ణు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story