Manchu Vishnu Interview: మనోజ్ తో పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

admin1
Updated on: 26 Aug 2021 7:00 PM IST
Manchu Vishnu Responded on Rumors about his Family in Alitho Saradaga
X

మంచు మనోజ్ - విష్ణు (ఫైల్ ఫోటో)

Manchu Vishnu Interview: మంచు విష్ణు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "మోసగాళ్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. తాజాగా మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఒకరిగా పాల్గొంటున్న మంచు విష్ణు తాజాగా "అలీ తో సరదాగా" షో కి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ విష్ణు తన గురించి తన కుటుంబం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అలీ మంచు విష్ణు ను మంచు మనోజ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

విష్ణు, మనోజ్ ల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంత? అని అడగగా ప్రోమోలో ఆ విషయానికి సీరియస్ అయిన మంచు విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రోమో లో చూపించారు. దీంతో ఏం జరిగి ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ మధ్యనే విడుదలైన ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ లో మంచు విష్ణు ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. "మా అక్క మా పాత ఇంట్లో ఉంటుంది. మనోజ్ వేరే గా ఉంటాడు. నేను మా అమ్మ నాన్న లతో కొంచెం దూరంగా ఉన్న ఇంట్లో ఉంటాము.

అంతే తప్ప మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మీడియా లో ఎన్నో పుకార్లు వస్తూ ఉంటాయి కానీ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు," అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. అంతేకాకుండా వాళ్ల నాన్న గారైన మోహన్ బాబు కి మంచు లక్ష్మి అంటే చాలా ఇష్టం అని తను ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఇట్టే తప్పించుకోగలదని చెప్పారు.

admin1

admin1

Next Story