"మా" బిల్డింగ్ కోసం స్థలాన్ని ఫైనల్ చేద్దామంటున్న మంచు విష్ణు

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 2:00 PM IST
Manchu Vishnu Posted a Video in Social Media About The Finalize MAA Building Place
X

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

Manchu Vishnu : త్వరలో జరగనున్న మా ఎలక్షన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి మా ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నిక బోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలక్షన్స్ లో పాల్గొంటున్న సినిమా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మొదట మంచు విష్ణు స్వయంగా తానే ముందుకు వచ్చి మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఖర్చులు మొత్తం తానే భరిస్తానని మా బిల్డింగ్ కోసం వాడే ప్రతి రూపాయి తానే ఇస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా దీనికి సంబందించిన ఒక అప్డేట్ ను విడుదల చేసారు.

"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన అసోసియేషన్ కి ఒక భవనం ఉండాలని మన అందరి కల. ఆ కల త్వరలో నిజం కాబోతోంది. నేను మా బిల్డింగ్ కోసం స్వయంగా మూడు స్థలాలను వెళ్లి చూడటం జరిగింది. అందులో ఏది బాగుంటుంది అనేది మనం అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. ఈ ఎగ్జైటింగ్ వార్తను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను," అంటూ మంచు విష్ణు కారు నడుపుతూ ఒక వీడియో ని చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చూస్తూ ఉంటే మా అసోసియేషన్ కోసం చాలా కష్టపడుతున్నారు అనిపిస్తోంది. అయితే ఆ కష్టం మంచు విష్ణు కి ఎన్నికలలో కాకపోయినా భవిష్యత్తులోనైనా కచ్చితంగా ఉపయోగపడుతుంది అని కొందరు భావిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story