డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మంచు విష్ణు

*డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మంచు విష్ణు

Rama Rao
Published on: 4 Nov 2022 7:27 PM IST
Manchu Vishnu Planning Movie With Prabhudeva | Telugu Movie News
X

డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మంచు విష్ణు

Manchu Vishnu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు విష్ణు హిట్ సినిమా అందుకొని చాలాకాలం అయింది. గత కొంతకాలంగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఆఖరికి ఈ మధ్యనే విడుదలైన "జిన్నా" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కేవలం ట్రోలర్లు మరియు మీమర్లకు తప్ప సినిమా మరెవరికి పనికి రాలేదు అని చెప్పుకోవచ్చు.

అయితే జిన్నా సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ మంచు విష్ణు మాత్రం ఏదో ఒకలాగా మరొకసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మంచు విష్ణు తన తదుపరి సినిమా పైన దృష్టి పెట్టాడు. అయితే ఈసారి మంచు విష్ణు ప్రభుదేవా తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే మంచు విష్ణు ప్రభుదేవా ను సంప్రదించారట. జిన్నా లో ఒక పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.

ఆ సమయంలోనే ప్రభుదేవా తో సినిమా చేయాలన్న ఆలోచనను బయటపెట్టాడు విష్ణు. ప్రభుదేవా కూడా సినిమాకి దర్శకత్వం వహించి చాలా రోజులు అయింది. అయితే ఎక్కువగా ప్రభుదేవా కథలను మాత్రమే చేస్తూ ఉంటారు. మరోవైపు విష్ణు చేతిలో ఇప్పుడు అరడజను సినిమా రీమేక్ రైట్లు రెడీగా ఉన్నాయి. అందులో ఏదో ఒక సినిమా కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తే బాగుంటుందని మంచి విష్ణు అనుకుంటున్నారట. మరి వీరిద్దరి కాంబోలో సినిమా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story