Manchu Vishnu: తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న మంచు విష్ణు

Manchu Vishnu: రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన అభిమానులు

Sandeep Eggoju
Updated on: 17 Oct 2021 9:33 PM IST
Manchu Vishnu Panel Reached to Tirumala for Visiting
X
తిరుమల చేరుకున్న మాన్చు విష్ణు ప్యానెల్ (ఫైల్ ఇమేజ్)

Manchu Vishnu: మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలసి తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో మంచు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమను గెలిపించిన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నట్లు విష్ణు తెలిపారు. మా ఎన్నికల హామీలలో ప్రదసానమైన మా భవనం గురించి మరో ప్రశ్న ఉత్పన్నం కాకుండా మూడు నెలల్లో సమాధానం చెబుతానన్నారు మంచు విష్ణు.

పవన్ కల్యాణ్ విష్ణు ఒకే విదిక మీద ఉన్నా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు వస్తున్న ట్రోల్స్ ను కొట్టి పారేసారు మంచు లక్ష్మీ. వారిద్దరు కలసి ఎన్నెన్నో విషయాలను చర్చించుకున్నట్లుగా చెప్పారు. ఒక్క ఫోటో చూసి ఏవేవో ప్రచారం చేసేస్తే ఎట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక తనదైన స్టైల్ లో వెంకటేశ్వర స్వామి తన పదనాన్నని ఆయన్ను దర్శించుకోవడానికి వెళ్తున్నానని మీడియాతో మాట్లాడారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story