Mosagallu Movie Trailer: ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న మంచు విష్ణు

'మోసగాళ్లు'లో విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ నటించిన సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు.

Kranthi
Updated on: 26 Feb 2021 2:57 PM IST
Manchu Vishnu Mosagallu Movie Trailer Released
X

'మోసగాళ్లు' మూవీ (ఫోటో ట్విట్టర్ )

Mosagallu Telugu Movie Trailer: 'మోసగాళ్లు'లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'మోసగాళ్లు'లో విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విష్ణు మాట్లాడుతూ.. చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

లాస్‌ఏంజెల్స్‌లో ప్రీతి జింటాను కలిసి 'మోసగాళ్లు' స్క్రిప్ట్‌ చెప్పాను. కథ విన్నాక.. 'వద్దు విష్ణు.. 'మోసగాళ్లు' విడుదలయ్యాక అమెరికాలో ఉన్న వాళ్లందరికీ నువ్వు విలన్‌లా కనిపిస్తావు' అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. వెంటనే నేను..'లేదండి.. ఇది నిజంగా జరిగిన కథ. విలన్‌, హీరో అనేది పక్కన పెడితే మనం రియల్‌స్టోరీని ప్రేక్షకులకు చూపించాలి అనేది నా ఉద్దేశం' అని చెప్పాను. 'నా కుటుంబమంతా ఇక్కడే సెటిల్‌ అయ్యింది. నా భర్తకు ఈ ప్రాంతంలో ఇల్లు ఉంది. ఒకవేళ నేను ఈ కథ చేస్తే ఇక్కడివాళ్లు నన్ను ఇబ్బందులకు గురిచేస్తారు. ఏం అనుకోకు విష్ణు.. నేను ఈ సినిమా చేయలేను' అని సున్నితంగా ఈ చిత్రాన్ని తిరస్కరించాట. దాంతో చేసేది ఏమి లేక కాజల్ కి ఫోన్ చేసి అడిగారట. వెంటనే ఒప్పుకుందట.

'ఈ సినిమాలో కాజల్‌ నాకు అక్క పాత్రలో నటించారు. నిజం చెప్పాలంటే ఆమె ఇందులో మెయిన్‌రోల్‌. సునీల్‌శెట్టి పోషించిన పోలీస్‌ పాత్రను మొదట్లో నేనే చేయాలనుకున్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

''2015లో ఓ అక్కాతమ్ముడు కలిసి గుజరాత్‌, ముంబయిల్లో ఉంటూనే.. ఒక సులభమైన ఆలోచనతో అమెరికాలో రూ.4వేల కోట్ల వరకు స్కామ్‌ చేశారు. వాళ్లు అదెలా చేశారు?ఆ డబ్బు ఎక్కడుంది? ఇంతకి వాళ్లు దొరికారా?లేదా?అన్నది ఈ చిత్ర కథాంశం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ కుంభకోణం వల్ల మోఅక్కడ కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి'' అంటూ సినిమా నేపధ్యాన్ని వివరించారు విష్ణు.


Kranthi

Kranthi

Next Story