Manchu Vishnu: "ప్రముఖ హీరోపై కేసు పెట్టాను" అంటున్న మంచు విష్ణు

Manchu Vishnu: "ప్రముఖ హీరోపై కేసు పెట్టాను" అంటున్న మంచు విష్ణు

Rama Rao
Updated on: 29 Sept 2022 9:00 PM IST
Manchu Vishnu Made Shocking Comments about Social Media
X

Manchu Vishnu: "ప్రముఖ హీరోపై కేసు పెట్టాను" అంటున్న మంచు విష్ణు

Manchu Vishnu: తాజాగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు తాజాగా ఇప్పుడు "జిన్నా" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మంచు విష్ణు తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేయగా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మంచు విష్ణు మరియు మంచు కుటుంబంపై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల గురించి ఘాటుగా రియాక్ట్ అయిన మంచు విష్ణు సోషల్ మీడియా వల్లనే టాలీవుడ్ ముక్కలు ముక్కలైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

"ఆన్లైన్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే కాక ఆయుధం కూడా ఉపయోగించే వారిపైనే అది ఎలా పని చేస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ మీడియాని సాధనంలా వాడేవారు బాగుపడతారు కానీ ఆయుధంలా వాడేవారు మాత్రం కష్టాల్లో పడతారు. జూబ్లీహిల్స్ లోని ఒక ప్రముఖ హీరో ఆఫీస్ నుంచి రెండు ఐపి అడ్రస్ లు మేము కనుక్కున్నాము. వారిపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కేసు నమోదు చేశాను.

ఎఫ్ ఐ ఆర్ బయటకు రాగానే ఆ హీరో పేరు కూడా బయటకు వస్తుంది" అని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు మంచు విష్ణు. ఇక ఆ స్టార్ హీరో ఎందుకు తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి చెడు కామెంట్లు పెడుతున్నాడు అని అర్థం కాలేదని అన్నారు. "మా ఎలక్షన్లకు ముందు నుంచి మొదలైన ఈ ట్రోలింగ్ గురించి ఇప్పటికి కూడా నేను సైలెంట్ గా ఉంటే పబ్లిక్ కి అది రాంగ్ మెసేజ్ అవుతుంది అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

Rama Rao

Rama Rao

Next Story