Kannappa: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ కానున్న విష్ణు మంచు 'కన్నప్ప' టీజర్

Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

Arun Chilukuri
Updated on: 14 May 2024 12:07 PM IST
Manchu Vishnu Kannappa Teaser Release Date Fixed
X

Kannappa: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ కానున్న విష్ణు మంచు 'కన్నప్ప' టీజర్

Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి ప్రభాస్ కూడా అడుగుపెట్టారు. కాగా, కన్నప్ప నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 20న కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించనున్నారు.

ఈ విషయాన్ని మంచు విష్ణు సోమవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో కన్నప్ప టీజర్‌ను ఆవిష్కరించనుండటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ ప్రేక్షకులకు మేము ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్‌ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు విష్ణు.

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story